హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెళ్లి చేయలేదని ఇంటికి నిప్పంటించిన కొడుకు

KDP: జమ్మలమడుగు మండలం గూడెం చెరువు రాజీవ్ నగర్ కాలనీలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రం వరలక్ష్మి అనే మహిళ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెళ్లి చేయలేదన్న కోపంతో పెద్ద కుమారుడు సురేంద్రనే ఇంటికి నిప్పంటించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రూ.1.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.