మన్యం: జిల్లాలో ఇవాళ ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకొనే అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ప్రక్రియకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP మాధవరెడ్డి తెలిపారు. మండల కార్యాలయాలలో జరగబోయే ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించడానికి ముందుస్తు భద్రతా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ఎన్నికల కేంద్రం వద్దకు అనుమతి లేని వ్యక్తులు ప్రవేశించకూడదన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు: SP


