హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి'

అల్లూరి: అక్వాన్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని చింతపల్లి RARS ADR డా.ఆదిలక్ష్మి సూచించారు. 'పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగునీటి కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను త్వరగా కోసి, ధాన్యం తడవకుండా సురక్షితంగా నిల్వ చేసుకోవాలి. కోళ్లు, పశుసంపదను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి' అని తెలిపారు.