హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పార్టీ మార్పులతో వైసీపీకి నష్టమేమీ లేదు'

అనకాపల్లి: వైసీపీ నుంచి ఎంపీటీసీగా గెలిచిన తన సోదరుడు వీసం నానాజీ టీడీపీలో చేరడం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ స్పష్టం చేశారు. పదవుల కోసం పార్టీ మారే వారి నిర్ణయాలకు భయపడేది లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం మంత్రి అనిత కుటుంబంలో చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తున్నారని, నైతిక విలువలతో కూడిన రాజకీయాలు ముఖ్యమన్నారు.