SKLM: తుఫాన్ కారణంగా జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. సంబంధిత PD, CDPOలు, అంగన్వాడీ కేంద్రాల టీచర్లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు


