అనకాపల్లి: అక్వాన్ తుఫాన్ హెచ్చరికలు నాతవరం మండలంలోని వరి రైతులను కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉండటంతో బలమైన గాలులు, భారీ వర్షాలు కురిస్తే పంట నేలకొరిగి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 16,303 ఎకరాల్లో వరి సాగు చేయగా, చేతికందే సమయంలో తుఫాన్ ముప్పు రావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు తుఫాన్ భయం


