NRML: భైంసా మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా చేయూత పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు బుధవారం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, మున్సిపల్ చైర్మన్ తూమొల్ల దత్తాత్రి ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని, పింఛన్లు లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని తెలిపారు.
తెలంగాణ
నూతన పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత


