హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీగా ఓటమి.. వార్డు సభ్యుడిగా ఏకగ్రీవం

కోనసీమ: మామిడికుదురు మండలం పెదపట్నం ఎంపీటీసీగా వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన ఏడిద లక్ష్మణరావు ఎన్నికల్లో వార్డుసభ్యుడిగా నిలిచారు. నాలుగో వార్డ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి ఆయన ఒక్కరే పోటీలో మిగిలారు. దీంతో లక్ష్మణరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించడమే మిగిలింది.