హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్య వివాహాల నిర్మూలన పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

ADB: బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్ రాజర్షి షా అధికారులతో కలిసి ఆదిలాబాద్‌లో బుధవారం ఆవిష్కరించారు. బాల్య వివాహాల అనర్థాలు, నియంత్రణ చర్యలు, బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి విస్తృత ప్రచారం నిర్వహించి జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.