హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమష్టి కృషితోనే వరంగల్‌కు సురక్షిత్ జిల్లా గుర్తింపు

WGL: హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో నిర్దేశిత లక్ష్యాలను సాధించి జిల్లా జాతీయ స్థాయిలో సురక్షిత్ జిల్లాగా గుర్తింపు పొందిందని కలెక్టర్ సత్యశారద తెలిపారు. వివిధ శాఖల అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సమష్టి కృషితోనే ఈ గుర్తింపు సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ఇందిరా బుధవారం కలెక్టర్‌ను సత్కరించారు.