మంచిర్యాల జిల్లాకు చెందిన నైనాశ్రీ తైక్వాండోలో ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. హైదరాబాద్ వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ద్రోణ అకాడమీ తరఫున పాల్గొని అండర్-48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిదని, జిల్లా అసోసియేషన్ కార్యదర్శి వెంకటస్వామి తెలిపారు. నైనాశ్రీతో పాటు కోచ్ అరుణ్ కుమార్, సుజిత్ ను అభినందించారు.
తెలంగాణ
తైక్వాండో జాతీయ స్థాయి పోటీలకు నైనాశ్రీ ఎంపిక


