CTR: కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.బి. శంకర్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 21వ తేదీలోపు అవసరమైన ధ్రువపత్రాలతో కళాశాలను సంప్రదించి ప్రవేశాలు పొందాలని సూచించారు. మరిన్ని వివరాలకు కళాశాల ప్రిన్సిపల్ను సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు


