హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నేడు ఉద్యోగ మేళా

గద్వాల జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో నేడు ఐడీవోసీలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రశాంతి తెలిపారు. 18–35 ఏళ్ల వయస్సు కలిగి SSC, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ అర్హతలున్న వారు పాల్గొనవచ్చన్నారు. అపోలో ఫార్మసీ, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తదితర సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.