హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీలర్‌షిప్ పేరుతో మోసం.. ఆరు నెలల జైలు శిక్ష

అనకాపల్లి టౌన్ పరిధిలో సిమెంట్ కంపెనీల అధీకృత డీలర్‌షిప్ ఇప్పిస్తానని నమ్మించి రూ.3,74,750 వసూలు చేసి మోసానికి పాల్పడిన బోదపు ప్రకాష్‌రావుకు న్యాయస్థానం ఆరు నెలల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో 15 రోజులు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఈ కేసును ఎస్‌ఐ ఎల్.రామకృష్ణ దర్యాప్తు చేశారు.