హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మార్కెట్‌లో క్రయవిక్రయాలు బంద్

MBNR: బాదేపల్లి జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డుకు అధిక సంఖ్యలో ధాన్యం రావడంతో కొనుగోలు చేసిన పంట ఉత్పత్తుల తరలింపులో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నేడు మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలను నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి అశ్వక్ హైమద్ తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి పంట ఉత్పత్తులను విక్రయానికి మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని సూచించారు.