హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనార్టీ స్టడీ సర్కిల్‌లో ప్రీ కోచింగ్

WNP: తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో TGPSC నిర్వహించబోయే గ్రూప్-2, 3 ప్రీ బేసిక్ ఫౌండేషన్ కోచింగ్ నిర్వహిస్తున్నారని వనపర్తి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సిరాజుద్దీన్ అహ్మద్ తెలిపారు. ఆసక్తి కలిగిన మైనార్టీలు ఈనెల 26 వరకు directorsmcccctelangana@gmail.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలన్నారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.