హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల భవన నిర్మాణానికి ప్రతిపాదనలు: ఎంఈవో

NGKL: వంగూరు మండలం కోనేటి పూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితిపై ఎంఈవో కొండల్ రెడ్డి స్పందించారు. కోనేటి పూర్ ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇంజనీర్లు నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపారని, నిధులు మంజూరు కాగానే పాఠశాల భవనం నిర్మిస్తామని తెలిపారు.