హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేరవరంలో వైసీపీలోకి భారీగా చేరికలు

కోనసీమ: ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు బుధవారం రాత్రి వైసీపీలో చేరారు. రాయి వెంకటేశ్వరరావు, బెజవాడ సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికలకు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు కల్పిస్తామన్నారు.