SKLM: అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. భక్తులు సమర్పించిన మొక్కులు, కానుకల రూపంలో రూ.57,92,190 ఆదాయం సమకూరింది. 15 గ్రాముల బంగారం, 1,080 గ్రాముల వెండి సైతం సమర్పించినట్లు ఈవో ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో అధికారులు మాధవి, నాగేశ్వరరావు, ప్రధాన అర్చకుడు శంకరశర్మ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అరసవల్లి ఆలయ ఆదాయ వివరాలు ఇలా!


