హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జ్ఞాపకశక్తిని పెంచే సూపర్ ఫుడ్..!

రాత్రంతా నీటిలో నానబెట్టిన 4-5 బాదం పప్పులను ఉదయాన్నే తొక్క తీసి తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్-E, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడి, శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందిస్తాయి. తొక్క తీసి తినడం వల్ల పోషకాలు శరీరానికి త్వరగా అందుతాయి.