హైదరాబాద్: 28°C
వార్తలు

ఇందిరమ్మ చీరలు, పింఛన్ల పంపిణీ ఎప్పుడంటే?

TG: ఇందిరమ్మ చీరలు, కొత్త చేయూత పింఛన్ల పంపిణీ ఈనెల 26కి వాయిదా పడింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ పథకాలను ఇవాళ ప్రారంభించాలని మొదట భావించారు. అయితే అనివార్య కారణాలతో దీనిని రాజ్యాంగ దినోత్సవం రోజుకు వాయిదా వేశారు. రాష్ట్రంలో కొత్తగా 4,63,857 మందికి చేయూత పింఛన్లు మంజూరయ్యాయి. కోటి మంది మహిళలకు చీరల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.