చాటింగ్ కోసం ఇన్‌స్టాగ్రామ్ వాడే వారికి మెటా గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ‘డైరెక్ట్’ పేరుతో ప్రత్యేక మెసేజింగ్ యాప్‌ను తీసుకురాబోతోంది. దీని ద్వారా రీల్స్ చూడకుండానే నేరుగా మెసేజ్‌లు పంపవచ్చు. ఇందులో నోట్స్, వాయిస్ ఎఫెక్ట్స్, స్టిక్కర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం టర్కీ, థాయ్‌లాండ్ దేశాల్లో పరీక్ష దశలో ఉన్న ఈ యాప్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
వ్యాపారం
ఇన్‌స్టాగ్రామ్ నుంచి కొత్త చాటింగ్ యాప్


