హైదరాబాద్: 28°C
వ్యాపారం

'చంద్రశేఖరన్ నిరాకరణతోనే వారసుడి అన్వేషణ!'

టాటా సన్స్ చైర్మన్‌గా మరోసారి కొనసాగేందుకు ఎన్.చంద్రశేఖరన్ నిరాకరించడంతోనే తగిన వారసుడిని వెతకాలని ట్రస్టీలంతా నిర్ణయించారని డారియస్ ఖంబటా వెల్లడించారు. రెండోసారి ఆ బాధ్యతలు చేపట్టేందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారని తెలిపారు. ఆ సమయంలో చంద్రశేఖరన్ స్థానంలో సరైన వ్యక్తి కోసం అన్వేషణ ప్రారంభించాలని అప్పట్లో ట్రస్టీలంతా ఏకగ్రీవంగా అంగీకరించారని ఖంబటా స్పష్టం చేశారు.