హైదరాబాద్: 28°C
వార్తలు

తుఫాన్ ముప్పు.. ప్రజలకు కీలక సూచనలు

AP: తుఫాన్ కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు జాగ్రత్తలు పాటించాలని వాతావరణశాఖ సూచించింది. 'తుఫాన్‌పై సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దు. విలువైన పత్రాలను వాటర్ ప్రూఫ్ కవర్లలో భద్రపరుచుకోవాలి. వారానికి సరిపడా ఆహార పదార్థాలు, తాగునీరు సిద్ధం చేసుకోవాలి. తుఫాన్ సమయంలో ఎలక్ట్రిక్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. చెట్లు, హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దు' అని హెచ్చరించింది.