హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా సామూహిక కార్తీక దీపోత్సవం

SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం 8వ రోజు సామూహిక కార్తీక దీపోత్సవాన్ని ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిళా భక్తులు, శ్రీ రాజరాజేశ్వరి సేవాసమితి సభ్యులు భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు భక్తులకు వాయినం అందజేశారు.