హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోజూ చేపలు తింటున్నారా? 

చేపలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నాణ్యమైన ప్రొటీన్‌ కండరాల బలోపేతానికి తోడ్పడుతుంది. విటమిన్‌ డి, బి12, ఐరన్‌ వంటి పోషకాలు కూడా లభిస్తాయి. కంటి ఆరోగ్యం, ఎముకల బలానికి ఉపయోగపడతాయి. అయితే తాజా చేపలను ఎంచుకుని మితంగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.