హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఎల్లారెడ్డిపేట మండలంలో పవర్ కట్

SRCL: ఎల్లారెడ్డిపేట 132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతు పనుల కారణంగా గురువారం మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, మరమ్మతు పనులకు సహకరించాలని కోరారు.