హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీ ప్రభుత్వం అప్పీల్.. కొట్టేసిన సుప్రీం

ఆజంఖాన్ శిక్షపై హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాలంటూ యూపీ ప్రభుత్వం వేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. క్రిమినల్ కేసుల్లో శిక్షపై స్టే సాధారణ హక్కు కాదని, అసాధారణ పరిస్థితుల్లోనే ఇచ్చే వెసులుబాటు అని స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రమే స్టే కోరడం కుదరదని తెలిపింది. నేరస్థులు రాజకీయాల్లో కొనసాగడాన్ని తేలికగా తీసుకోలేమని పేర్కొంది.