హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన చేయూత పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి పొన్నం

KNR: సైదాపూర్ మండలంలో అర్హులైన లబ్ధిదారులకు 642 నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీ డీఆర్డీవో గీతా, డీపీవో, మార్కెట్ కమిటీ ఛైర్మన్ సుధాకర్, సింగిల్ విండో ఛైర్మన్ పాల్గొన్నారు.