హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేకు ఆటో డ్రైవర్ల వినతి

BDK: మణుగూరు పట్టణంలోని ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం పినపాక ఎమ్మెల్యే, అసెంబ్లీ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ నాయకులు సారెడ్డి పుల్లారెడ్డి, సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రైవర్లు తమ సమస్యలను వివరించారు. సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.