NRML: జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవన నిర్మాణ పనులను గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, వసతి గృహాల నిర్మాణాలు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనుల పురోగతిని ప్రతి వారం సమీక్షిస్తానని తెలిపారు. సమావేశంలో వైద్యాధికారులు, కళాశాల ప్రిన్సిపల్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'వైద్య కళాశాల పనులు వేగవంతం చేయాలి'


