GDWL: గద్వాల పట్టణంలోని ఏడో వార్డు పిల్లిగుండ్ల కాలనీలో సర్వే నంబర్ 826లో సుంకులమ్మ ఆలయం సమీపంలోని 10 శాతం భూమిని కాపాడాలని కాలనీవాసులు కోరారు. ఈ మేరకు జిల్లా అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రజా అవసరాలకు కేటాయించిన భూమిని పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


