NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద ఆనంద్ షాపింగ్ మాల్ పక్కన నూతనంగా నిర్మిస్తున్న మూడంతస్తుల భవనంపై నుంచి సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఓ యువతి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ
భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం


