BDK: పాల్వంచ నందనవనం అర్బన్ పార్క్, అటవీ కలప డిపో, అటవీ నర్సరీలను బుధవారం జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ సందర్శించి పరిశీలించారు. పార్కులో పచ్చదనం, మొక్కల పెంపకం, సందర్శకులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కలప డిపోలో నిల్వలు, భద్రత, రికార్డుల నిర్వహణను తనిఖీ చేశారు. నాణ్యమైన మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించారు.
తెలంగాణ
మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలి: DFO


