హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇరుకు రోడ్లతో ఖేడ్‌లో ట్రాఫిక్ కష్టాలు

SDPT" ఖేడ్ పట్టణంలోని మంగళ్‌పేటలో ఇరుకు రోడ్ల కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. బుధవారం చెరుకు లారీలు రోడ్డుపైకి రావడంతో ఎదురుగా వచ్చిన వాహనాలకు దారి లేక భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రద్దీ వేళల్లో భారీ వాహనాలను నియంత్రించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.