SRPT: కొలిముంతలపాడ్‌లో ఇటీవల నిర్వహించిన జోనల్ క్రీడా పోటీల్లో చిలుకూరు పూలే కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. వాలీబాల్, హైజంప్‌లో ప్రథమ, కబడ్డీ, టెన్నికాయిట్‌లో ద్వితీయ, డిస్కస్ త్రోలో తృతీయ స్థానాలు సాధించారు. పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విజేతలను ప్రిన్సిపాల్ శోభారాణి, వ్యాయామ ఉపాధ్యాయుడు లెనిన్ అభినందించారు.
తెలంగాణ
క్రీడల్లో చిలుకూరు పూలే కళాశాల సత్తా


