హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులకు నిధులు తెస్తాం: ఎమ్మెల్యే

NZB:రాజకీయాలకు అతీతంగా నగర అభివృద్ధికి కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. బుధవారం నగరంలోని 34, 39వ డివిజన్లలో రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడతామని, ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారంతో పార్లమెంట్ పరిధిలో అభివృద్ధిని కొనసాగిస్తామని పేర్కొన్నారు.