హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 20న మండల సర్వసభ్య సమావేశం

MBNR: నవాబుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 20న ఉదయం 10 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జయరాం నాయక్ తెలిపారు. స్పెషల్ ఆఫీసర్ సునీత అధ్యక్షతన సమావేశం జరగనుంది. అన్ని శాఖల అధికారులు అభివృద్ధి పనుల వివరాలు, పురోగతి నివేదికలతో హాజరుకావాలని సూచించారు.