హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంక్షేమ పథకాల పంపిణీలో ఎమ్మెల్యే తెల్లం

BDK: వాజేడు మండలంలో 460 మంది లబ్ధిదారులకు పింఛన్లు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పంపిణీ చేశారు. రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మారుమూల గిరిజన గ్రామాలకు సైతం సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.