KMR: బిచ్కుంద 6వ వార్డులోని రాజుల చౌరస్తా నుంచి గణేష్ విగ్రహం గుడి వరకు రహదారి గుంతలమయంగా మారడంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీఆర్పీ జుక్కల్ ఇన్‌ఛార్జి జాదవ్ ఈశ్వర్ తెలిపారు. బుధవారం రహదారిని పరిశీలించిన ఆయన అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.
తెలంగాణ
గుంతలమయంగా బిచ్కుంద 6వ వార్డు రోడ్డు


