హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా: మంత్రి కొల్లు రవీంద్ర సోదరి మృతి

కృష్ణా: మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం నెలకొంది. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మంత్రి సోదరి నడకుదిటి శేష మల్లేశ్వరి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. దివంగత మాజీ మంత్రి నడకుదిటి నరసింహరావుకు ఆమె సతీమణి. ఆమెకు ముగ్గురు కుమార్తెలు.పెద్ద కుమార్తె నీలిమను మంత్రి రవీంద్ర వివాహం చేసుకున్నారు.