అన్నమయ్య: మదనపల్లె సీటీఎం రోడ్డు ఎస్టేట్లో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. 50 ఏళ్ల రాధమ్మ టిన్నర్ ఉపయోగించి కట్టెల పొయ్యి వెలిగిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు వెంటనే రాధమ్మను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
అగ్ని ప్రమాదంలో మున్సిపల్ కార్మికురాలికి తీవ్ర గాయాలు


