హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీటీసీలు..!

VSP: నక్కపల్లి మండలంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పెదబోదుగాలం, రేబాక గ్రామాల నుంచి ఎంపీటీసీలుగా గెలుపొందిన వీసం నానాజీ, వీసం దేవి దంపతులు టీడీపీ పార్టీలో చేరారు. నక్కపల్లిలోని హోంమంత్రి వంగలపూడి అనిత నివాసంలో ఆమె సమక్షంలో వీరు టీడీపీ కండువా కప్పుకున్నారు. మంత్రి వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.