హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏలూరుకు అతిభారీ వర్ష హెచ్చరిక

ELR: అక్వాన్ తుపాను ప్రభావంతో ఏలూరు జిల్లాలో గురు, శుక్రవారాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ, విపత్తుల సంస్థ హెచ్చరించాయి. శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు–తుని–యానాం మధ్య తీరం దాటనుంది. గంటకు 120–130 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.