హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్నికి ఆహుతైన రెండు పూరిళ్లు

కృష్ణా: పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా రెండు పూరిళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పక్కనే ఉన్న గడ్డివాము సైతం కాలిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.