హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అక్వాన్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి'

కృష్ణా: అక్వాన్ తుపాను నెమ్మదిగా కదులుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతం మచిలీపట్నం, విశాఖకు 620 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందన్నారు. శుక్రవారం నెల్లూరు-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 145 కి.మీ వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందన్నారు. కోస్తా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.