NLG: నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ దిగువన ఏపీ చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ఈఎన్సీ కృష్ణా బోర్డు (కేఆర్ఎంబీ)కి లేఖ రాశారు. అనుమతి, సమాచారం లేకుండా పనులు సాగుతున్నాయని, విభజన చట్టాన్ని ఏపీ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. తక్షణమే బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ ఇప్పటికే కేటాయింపులకు మించి నీటిని వాడుతోందని తెలిపారు.
తెలంగాణ
కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ


