హైదరాబాద్: 28°C
వార్తలు

VIRAL: భార్య వేధింపులు భరించలేకపోతున్నా!

TG: మహబూబ్‌నగర్(D) మోతీఘనపూర్‌లో విషాదకర ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన 23 ఏళ్ల శివప్రసాద్, భార్య వేధింపులు భరించలేక తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ సెల్ఫీ వీడియో విడుదల చేసి అదృశ్యమయ్యాడు. స్కూటీపై హైదరాబాద్ వైపు బయలుదేరిన అతడు, కొత్తూరు సమీపంలో వాహనాన్ని వదిలి వెళ్లినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శివప్రసాద్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.