హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉంగుటూరు నామినేషన్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు

ELR: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉంగుటూరు నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు నిర్వహించారు. నామినేషన్ కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. లోపలికి సంబంధిత వ్యక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రజలు గుంపులు గుంపుగా చేరకుండా పోలీసులు చెదరగొడుతున్నారు. ఎన్నికల ప్రక్రియకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.