హైదరాబాద్: 28°C
వార్తలు

నౌకాదళానికి 9 కొత్త జలాంతర్గాములు

భారత నౌకాదళం మరింత బలోపేతం కానుంది. సుమారు రూ.1.11 లక్షల కోట్లతో 9 కొత్త జలాంతర్గాముల నిర్మాణానికి రక్షణ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రూ.75 వేల కోట్లతో ప్రాజెక్టు-75(I)ను అమలు చేయనున్నారు. జర్మనీకి చెందిన TKMSతో కలిసి మజాగావ్ డాక్(MDL) దేశీయంగా 6 అత్యాధునిక జలాంతర్గాములను నిర్మించనుంది. దీంతో సముద్ర జలాల్లో భారత నావికాదళం మరింత పటిష్టంగా మారనుంది.